నష్టాల్లో అరవింద సమేత

SMTV Desk 2018-10-25 17:24:05  Jr NTR, Aravinda Sametha,

హైదరాబాద్, అక్టోబర్ 25: దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అరవింద సమేత విజయ పథంలో దూసుకెళ్తుంది. అక్టోబర్ 11 గురువారం రిలీజైన ఈ సినిమా ఇప్పటి వరకు 83 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. జనతా గ్యారేజ్ 81 కోట్ల షేర్ తో ఎన్.టి.ఆర్ కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీ కాగా ఆ ఫిగర్ ను క్రాస్ చేసిన అరవింద సమేత తారక్ కెరియర్ లో నెంబర్ 1 పొజిషన్ లో నిలిచింది. ఇదిలాఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 91 కోట్లు జరిగింది.

అంటే ఎలా లేదన్నా ఇంకా 8 కోట్లు రాబట్టాల్సి ఉంది. రోజుకి కోట్ల వసూళ్ల నుండి 13వ రోజు బుధవారం 20 లక్షల లోపే అరవింద సమేత కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. చూస్తుంటే కొన్ని ఏరియాల్లో అరవింద సమేత డిస్ట్రిబ్యూటర్స్ కు కొద్దిపాటి నష్టాలను మిగిల్చేలా ఉంది. త్రివిక్రం, ఎన్.టి.ఆర్ లాంటి కాంబినేషన్ అయినా సరే 100 కోట్ల షేర్ రాబట్టడంలో విఫలమైంది అరవింద సమేత. ఎన్.టి.ఆర్ సక్సెస్ ఖాతాలో ఈ సినిమా నిలిచినా కొద్దిపాటి నష్టాలు తప్పేలా లేదని అనిపిస్తుంది.