జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ట్వీట్ చేసిన కేటీఅర్

SMTV Desk 2018-10-25 16:27:45  YS JAGAN, KTR, AP GOVERNAMENT, MURDER ATTEMPT

హైదరాబాద్, అక్టోబర్ 25: జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తూ తెలంగాణ మంత్రి కేటీఅర్ దానికి కారణమైన వ్యక్తుల పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధ్యులను కఠినంగా శిక్షించాలి. జగన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని కేటీఆర్ ట్వీట్ చేశారు.


దాడిలో గాయపడ్డ జగన్‌.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు ఈ విషయమై స్పందించారు. ప్రతిపక్షనేతపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.