కళ్యాణ్ రామ్ తో మాటల మాంత్రికుడు ..?

SMTV Desk 2018-10-25 15:00:48  Trivikram srinivas, kalyan ram,

హైదరాబాద్, అక్టోబర్ 25: మాటల మాంత్రికుడు మొదటిసారి నందమూరి హీరోతో చేసిన సినిమా అరవింద సమేత వీర రాఘవ. ఇన్నాళ్లు మెగా క్యాంప్ లోనే సినిమా చేసిన త్రివిక్రం ఎన్.టి.ఆర్ తో చేసిన సినిమా రేంజ్ ఏంటన్నది ఆ సినిమా వసూళు చేస్తున్న కలక్షన్స్ చూస్తే అర్ధమవుతుంది. అరవింద సమేత హంగామా ముగిసింది. తన తర్వాత సినిమా అల్లు అర్జున్ తో దాదాపు కన్ఫాం చేసినట్టు తెలుస్తుంది.

ఇదిలాఉంటే ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో త్రివిక్రం ఓ సినిమా ఉండబోతుంది అని ఫిల్మ్ నగర్ టాక్. కళ్యాణ్ రామ్ ఆల్రెడీ త్రివిక్రం కు పెద్ద మొత్తంలో అడ్వాన్స్ కూడా ఇచ్చాడని తెలుస్తుంది. ఇప్పటికే త్రివిక్రం మైత్రి మూవీ మేకర్స్, డివివి దానయ్యతో సినిమాలు చేయాల్సి ఉంది. ఇప్పుడు ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ కూడా ఆ లిస్ట్ లో చేరింది. తన తర్వాత సినిమా కూడా హారిక అండ్ హాసిని బ్యానర్ లో చేస్తున్న త్రివిక్రం ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో చేసే సినిమాకు హీరో ఎవరై ఉంటారా అని డిస్కస్ చేస్తున్నారు. మళ్లీ ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తాడా లేక కళ్యాణ్ రామ్ హీరోగా మూవీ ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది.