ఏపీ ఉపాధ్యాయ ఉద్యోగార్దులకు శుభవార్త...

SMTV Desk 2018-10-25 13:23:12  DSC, NOTIFICATIONS, ANDHRA PRADESH

విజయవాడ, అక్టోబర్ 25: ఎప్పటినుండో ఎదురు చూస్తున డీఎస్సీ నోటిఫికేషన్ లకు ఇప్పుడు ముహూర్తం కుదిరింది. ఉపాధ్యాయ ఉద్యోగార్దులకు తీపి కబురే ఇది. రేపు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అనేక సాంకేతిక కారణాల వల్లే నోటిఫికేషన్ ఆలస్యం అయిందని ఆయన వివరణ ఇచ్చారు.

డీఎస్సీ షెడ్యూల్‌ను మంత్రి గంటా ప్రకటించారు.

ఢీఎస్సీ షెడ్యూల్..

* రేపు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
* నవంబర్ 1 నుంచి ఫీజ్ పేమెంట్
* నవంబర్ 1 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్
* నవంబర్ 17 నుంచి ఆన్‌లైన్ మాక్ టెస్టులు
* నవంబర్ 19 నుంచి 24 వరకు పరీక్ష కేంద్రాల ఎంపిక .
* నవంబర్ 29 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ .
* స్కూల్ అసిస్టెంట్స్(నాన్ లాంగ్వేజ్) - డిసెంబర్ 6 నుంచి 10 వరకు పరీక్ష .
* స్కూల్ అసిస్టెంట్స్(లాంగ్వేజ్) - డిసెంబర్ 11న పరీక్ష .
* డిసెంబర్ 12, 13న పీజీ టీచర్స్ రాతపరీక్ష .
* లాంగ్వేజ్ పండిట్స్ పోస్టులు - 452 .
* 7,675 ఉద్యోగాలు భర్తీ .
* ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయోపరిమితి 47 ఏళ్ల నుంచి 49 ఏళ్లకు పెంపు .
* జనరల్ అభ్యర్థులకు 42 నుంచి 44 ఏళ్లకు వయోపరిమితి పెంపు .
* దివ్యాంగులకు 52 నుంచి 54 ఏళ్లకు వయోపరిమితి పెంపు .





ఇప్పటికే అనేకసార్లు నోటిఫికేషన్‌ వాయిదాలు పడింది. చివరకు మోక్షం లభించింది. ఈ డీఎస్సీలో 7,675 పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్ విడుదలకు మళ్లీ ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.