భారత్ కు 321 సంఖ్య శాపంగా మారిందా...?

SMTV Desk 2018-10-25 12:47:39  ODI,TEAM INDIA,WEST INDIES, MATCH DRAW

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 25: భారత్ కి 321 పరుగుల సంఖ్యా బహుశా అచ్చిరాదేమో. భారత్ ఇది వరకు రెండు మ్యాచ్ లో 321 పరుగులు చేసి వోటమి పాలయ్యింది. నిన్న వైజాగ్ లో భారత్-విండీస్ మధ్య జరిగిన రెండో వన్డే లో మల్లీ అదే 321 పరుగుల దగ్గర టై అయ్యింది. దీన్ని బట్టి చూస్తే భారత్ కి ఈ సంఖ్య కలిసిరాదని అనుకుంటున్నారు.

2007 లో ఛండీగడ్‌ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 వోవర్ల 9 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. సచిన్‌ తెందుల్కర్‌(99) వ ఒక్క పరుగు తేడాతో శతకం కోల్పోయాడు. అనంతరం బరిలోకి దిగిన పాక్‌.. యూనిస్‌ ఖాన్‌(117) అద్భుత శతకంతో మరో బంతి మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

2017లో వోవల్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. శిఖర్‌ ధవన్‌(125) శతకానికి తోడు రోహిత్‌ శర్మ(78), ధోనీ(63) అర్థ శతకాలు చేశారు. అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక 48.4 వోవర్లో 322 పరుగులు సాధించి విజయం సాధించింది.

మల్లీ ఇప్పుడు అదే రిపీట్ అవుతుందేమో అని అభిమానులు ఆందోళన పడుతున్నారు.