హీరాగ్రూప్ బాధితులు ఇంకా పెరుగుతూనే వున్నారు.

SMTV Desk 2018-10-24 15:36:56  nowhira goup of company,high court,bail petition

హైదరాబాద్, అక్టోబర్ 24: హీరాగ్రూప్ బాధితులు ఇంకా పెరుగుతూనే వున్నారు. ఈ రోజు నగరం లోని నాంపల్లి కోర్టులో ఈ కేస్ విచారణ జరుగగా అక్కడికి హీరాగ్రూప్ బాధితులు భారీగా చేరుకుంటున్నారు. న్యాయవాది పై తిరుగుబాటు చేశారు. అంతేకాక బాధితులపై హీరా గ్రూప్‌ లాయర్‌ తరపు బౌన్సర్లుతో దాడి చేశారు. నౌహీరా కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై తీర్పును నాంపల్లి కోర్టు సాయంత్రానికి వాయిదా వేసింది. కాగా హీరాగ్రూప్‌ బాధితుల తరపున కౌశిక్‌ పాషా మరో పిటిషన్‌ను దాఖలు చేశారు. నౌహీరాకు బెయిల్‌ ఇవ్వోద్దని, ఆమె ఆస్తులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని పిటిషన్‌లో కోరారు.