కన్న కొడుకును చంపిన తల్లి

SMTV Desk 2017-05-30 17:40:19  mother,kills,baby boy

కృష్ణా, మే 30 : కృష్ణా జిల్లా, జగ్గయ్య పేట మండలం, ముళ్ళపాడులో విషాదం చోటు చేసుకుంది. తల్లి అనే పదానికి మచ్చ తెచ్చిన మహిళ సుజాత. అతిచిన్న వయసులో (3) ఉన్న తన కుమారున్ని చంపేసింది. గత కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటుంది. ఈ మధ్య ఆమె ఒకరితో అక్రమ సంభంధం పెట్టుకుంది. ఐతే వాళ్లిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ పెళ్లి కి తన కుమారుడు అడ్డుగా ఉంటాడని సుజాత అనుకుంది. తన కొడుకును చంపాలని అనుకుంది. ఐతే అశోక్ తినే అన్నంలో పురుగుల మందు కలిపి తినిపించి చంపేసింది. తన శవాన్ని భావిలో పడేసి తెల్లవారి ఆమె పోలిస్ స్టేషన్ కు వెళ్లి నా కొడుకు కనిపిచడం లేదని పోలిస్ స్టేషన్ లో కేసు పెట్టింది. 27 వ తేదిన బావిలో శవం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ శవాన్ని పోస్టు మార్టం కు పంపిచారు. తరువాత విషప్రయోగం జరిగిందని డాక్టర్లు చెప్పారు. దీని గురించి సుజాత ను నిలదీయగా అసలు విషయం చెప్పింది. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.