అమ్మవారికి కోటి గాజుల సమర్పణ

SMTV Desk 2018-10-24 13:28:08  vijayawada,kanakadurga temple

విజయవాడ, అక్టోబర్ 24: కనకదుర్గమ్మకు కోటి గాజులు కానుకగా సమర్పించిన భక్తులు. ఇంద్రకీలాద్రిపై కొలువైన ఈ అమ్మకు ప్రకాశం జిల్లా చీరాల పట్టణానికి చెందిన వెంకట సీతారామంజనేయ షణ్ముఖ మహిళా సమాజం, శ్రీకైవల్యాకృతి సేవా సంఘం, శివ దత్త క్షేత్రం సంయుక్తంగా కోటి గాజులను దుర్గ గుడి ఈవో కోటేశ్వరమ్మకు ఈరోజు అందజేశారు. కాగా త్వరలో అమ్మవారికి జరగనున్న గాజుల అలంకరణకు భక్తులు, దాతలు సమర్పించిన గాజులనే వినియోగిస్తామని ఆలయ అధికారులు చెప్పారు.