కోవింద్ ఖాయమా...?

SMTV Desk 2017-07-20 16:26:14  president elections result, counting, president kovindh , meera kumar

న్యూఢిల్లీ, జూలై 20 : రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఓట్ల లెక్కింపు ఉదయం నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో రామ్ నాథ్ కోవింద్ కు 60, 683 భారీ ఓట్లు, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి మీరా కుమార్ కు 22, 941 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు జరిగిన లెక్కింపు లో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ భారీ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఇరు వర్గాల పార్టీల నేతలు కోవింద్ కే రాష్ట్రపతి పదవి ఖాయమని అంటున్నారు. సాయంత్రం 5 గంటల తరువాత భారత రాష్ట్రపతి పదవిని ఈ అభ్యర్ధుల్లో ఎవరు సొంతం చేసుకోనున్నారో తెలియనుంది. ఈ ఎన్నికల్లో 99శాతం ఓటింగ్‌ నమోదైంది. అధికార ఎన్డీయే తరఫున బిహార్‌ మాజీ గవర్నర్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌,18 విపక్ష పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ ఈ ఎన్నికల్లో పోటీపడ్డారు. ఎన్డీయే కూటమి పార్టీలతో పాటు జేడీయూ, తెరాస, అన్నాడీఎంకే తదితర మరికొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా కోవింద్‌కే మద్దతిచ్చాయి. దీంతో కోవింద్‌ గెలుపు లాంఛనమే అయినప్పటికీ ఎంత మెజార్టీ వస్తుందనేది సాయంత్రం తేలనుంది. జూలై 25న నూతన రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేస్తారు.