వెస్టిండిస్ జట్టుతో తలపడే భారత జట్టుని బీసీసీఐ ప్రకటించింది.

SMTV Desk 2018-10-23 17:28:50  team india,west indies, bcci, oneday series

హైదరాబాద్,అక్టోబర్ 23: బుదవారం విశాఖపట్నం వేదికగా చేసుకుని పర్యాటక విండీస్ తో తలపడే భారత జట్టు ని బీసీసీఐ నిన్న ప్రకటించింది.అయితే 5 వన్డే ల సిరీస్ లో భాగంగా రెండో వన్డే విశాఖ లో జరుగతుందన్న విషయం తెలిసిందే ,కాగా భారత జట్టులో కొన్ని మార్పులు చేసారు అందరు మొదటి జట్టు లో ఉన్నవారే కాని రెండో వన్డే లో ఇంకొక పేరుని చేర్చారు.చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కి ఇందులో అవకాసం కల్పించారు.
ఐదు వన్డేల సిరిస్‌లో ఇప్పటికే తొలి వన్డే గెలిచి ఉత్సాహంగా ఉన్న టీమిండియా అచ్చొచ్చిన వైజాగ్‌ స్టేడియంలో మరో విజయాన్ని నమోదు చేయాలని ఊవిళ్లూరుతోంది. ఇటీవల కాలంలో మ్యాచ్‌కు వొక రోజు ముందే 12 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించే కొత్త సంప్రదాయానికి తెరలేపిన బీసీసీఐ రెండో వన్డేకి ముందు కూడా జట్టుని ప్రకటించింది.

ఇదిలా ఉంటే బుధవారం టీమిండియా ఆడుతున్న వన్డే 950వ వన్డే కావడం విశేషం. ఈ మైలురాయిని అందుకోనున్న తొలి జట్టుగా భారత జట్టు రికార్డు సృష్టించనుంది.

విశాఖ స్టేడియంలో భారత్‌ ఇప్పటివరకు మొత్తం 8 వన్డేలాడింది. అందుల వొక మ్యాచ్‌ ఓడింది. ఆ వోటమి వెస్టిండీస్‌ చేతిలోనే కావడం గమనార్హం.

విశాఖ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం
రెండో వన్డే కోసం పిచ్‌ దాదాపుగా సిద్ధమైంది.


టీమిండియా:
విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, అంబటి రాయుడు, రిషభ్‌ పంత్‌, ఎంఎస్‌ ధోని, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చహల్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, ఖలీల్‌ అహ్మద్‌