పురుషులకి 18 చాలు....!

SMTV Desk 2018-10-23 14:54:51  supreme court,petetion,ashok pandey,ranjan gogoru,sk koul

న్యూఢిల్లీ అక్టోబర్23:అమ్మాయికి 18 ఏళ్ళు వస్తే చాలు తరువాత పెళ్ళికి సిధం చేస్తారు.ఇదే విధంగా పురుషులకు కూడా 18 ఏళ్ళు చాలు 21 వొద్దు అని,వయసు తగ్గించాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. అయితే ఈ పిటిషన్ వల్ల ఏం ఉపయోగం లేదు అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసిన న్యాయవాది అశోక్‌ పాండేకు చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోరు, న్యాయమూర్తి ఎస్‌కె కౌల్‌లతో కూడిన ధర్మాసనం 25వేల జరిమానానూ విధించింది. 18 ఏండ్ల వయసుతో బాలుడు మేజర్‌ అవుతాడని, ఓటు వేయడానికి కూడా అర్హుడవుతాడని పిటిషన్‌లో న్యాయవాది అశోక్‌ పాండే పేర్కొన్నారు. మహిళలు, పురుషులకు వివాహ వయస్సు వేర్వేరుగా ఉండటం వల్ల పురుషులు నష్టపోతున్నారని వాదించారు. అయితే ఈ సమస్యలతోనే పురుషుడు ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే మీరు కట్టే ఆ 25వేల జరిమానాను వారికి అందజేస్తామ ని బెంచ్‌ అన్నది. పురుషుల వివాహ వయసును పేర్కొనే బాల్య వివాహల నిరోధక చట్టం, ప్రత్యేక వివాహ చట్టం, హిందూ వివాహ చట్టాలు రాజ్యాంగం కల్పించే ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నాయని పిటిషన్‌లో వివరించారు.