సాహూ యాక్ష‌న్ ఎపిసోడ్‌

SMTV Desk 2018-10-23 11:57:42  Prabhas , Saaho action episode, Happy Birthday Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో సాహో సినిమాతో పాటు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వొక సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ రెండు సినిమాలు శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ చిత్రం వొక్క‌టి కూడా విడుద‌ల కాక‌పోవ‌డంతో ఈ రెండు సినిమాల‌కి సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రోజు ప్ర‌భాస్ బ‌ర్త్‌డే కావ‌డంతో సాహో సినిమాకి సంబంధించిన యాక్ష‌న్ ఎపిసోడ్‌ని వీడియో ద్వారా విడుద‌ల చేశారు. ఇన్నాళ్లు ఫస్ట్‌లుక్‌తోనే సరిపెట్టిన చిత్రయూనిట్ ఈ రోజు(మంగళవారం) ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా షేడ్స్‌ ఆఫ్‌ సాహో చాప్టర్‌ 1 పేరుతో అభిమానులుకు గిఫ్ట్ ఇచ్చారు. యాక్షన్‌ సీన్స్‌కు సంబంధించిన మేకింగ్‌ వీడియోతో పాటు ప్రభాస్‌, అరుణ్‌ విజయ్‌, హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌లను కూడా ఈ వీడియోలో చూపించారు.