ఆ పాత్రలకి పూర్తిగా న్యాయం చేశాను..!

SMTV Desk 2018-10-16 11:30:40  HELLO GURU PREMAKOSAME , RAM ,ANUPAMA,

హైదరాబాద్‌, అక్టోబర్ 16:రామ్‌, అనుపమా పరమేశ్వరన్‌, ప్రణీత నాయకానాయికలుగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం హలో గురు ప్రేమ కోసమే . ఈనెల 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్‌ ఇటీవల చిత్ర ప్రీ-రిలీజ్‌ వేడుకను అత్యంత వైభవంగా హైదరాబాద్‌లో నిర్వహించింది.

ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడలోనూ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది అనుపమ. ఈ మధ్య పరాజయాలు ఎదురయ్యాయి కదా అని అడిగితే... వాటితో కొన్ని కొత్త పాఠాలు నేర్చుకొన్నాగా అని సమాధానమిస్తోంది. ‘‘మనం చేసిన ప్రతి ప్రయత్నం ఫలితం ఇవ్వదు కదా. సినిమా రంగంలోనూ అంతే. కానీ పరాజయాలొచ్చాయి కదా అని ఎప్పుడూ అధైర్యపడలేదు. మంచి కథల్నే ఎంపిక చేసుకొన్నా. నాకు అప్పజెప్పిన పాత్రలకి పూర్తిగా న్యాయం చేశాను. ఇక ఫలితాలనేవి మన చేతుల్లో ఉండవు కదా. అయితే కథల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మాత్రం అర్థమైంద’’ని చెప్పింది అనుపమ.