అధికారం లోకి వచ్చేది మా ప్రభుత్వమే ..!

SMTV Desk 2018-10-16 10:09:08  Janasena ,Pawan kalyan, kavathu, Dowleswaram Barrage

హైదరాబాద్‌, అక్టోబర్ 16:2019లో జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడమే తమ ధ్యేయమని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీపై వేలాది మందితో కవాతు నిర్వహించిన అనంతరం కాటన్‌ బ్యారేజీ వద్ద సోమవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సిఎం కుమారులు సిఎం పదవి కావాలని కోరుకుంటున్నారని, కానిస్టేబుల్‌ కుమారుడు సిఎం కాకూడదా? అని ప్రశ్నించారు. తనకు రాజకీయ అనుభవం ఏముందని సిఎం ప్రశ్నిస్తున్నారని, లోకేష్‌కు రాజకీయ అనుభవం ఉందా? అని ప్రశ్నించారు.


రాజకీయ పార్టీని నడిపే వ్యక్తికి అనుభవం ఉండాలని నమ్మే వ్యక్తిని . నేను పార్టీ పెట్టింది స్వప్రయోజనాల కోసం కాదు.. రాష్ట్రప్రయోజనాల కోసమే రాష్ట్ర శ్రేయస్సు కోసం 2009లో పోటీ చేయకుండా చంద్రబాబుకి మద్దతిచ్చా . సినిమాలను వదిలేసి, ఏమీ ఆశించకుండా రాష్ట్రం కోసం వచ్చా , పదవులు ఆశించకుండా టీడీపీకి మద్దతిచ్చా ,చాలా మంది నా భావజాలాన్ని ఇష్టపడి జనసైనికులుగా మారుతున్నారు. జనసేన భావజాలం ప్రజల్లోకి వెళ్లకూడదనేది టీడీపీ ఉద్దేశం , నిరుద్యోగ సమస్యతో యువకులు రగిలిపోతున్నారు , బాధ్యతగా ఉన్న నన్ను ఏ రోజు కూడా ప్రత్యేక హోదా అంశంలో నా సలహా అడగలేదు ఉత్తరాంధ్ర నుంచి ఏ మూలకు వెళ్లినా సమస్యలే మౌలిక వసతులుండవు, రోడ్లు ఉండవు.. కానీ విజన్ 20-20 అంటారు.

ధవళేశ్వరం బ్యారేజ్‌ పై నిర్వహిస్తున్న జనసేన కవాతుకు రెండు లక్షల మంది వస్తారని పార్టీ నాయకుల అంచనా. మధ్యాహ్నం 3గంటలకు పిచ్చుకలంక నుంచి కవాతు ప్రారంభమై ధవళేశ్వరం కాటన్‌ విగ్రహం వరకు సాగుతుందని, అక్కడ సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ ఉంటుందని స్పష్టం చేశారు పార్టీ నేతలు. ధవళేశ్వరం-వేమగిరి రోడ్డు ఫేసింగ్‌లో సభ నిర్వహించనున్నారు.

కాపు రిజర్వేషన్‌ గురించి మాట్లాడుతూ బిసిలకు నష్టం లేకుండా కాపు రిజర్వేషన్‌ ఉండాలన్నది తమ ఉద్ధేశ్యమన్నారు. తాను కాపులను దూరం పెట్టడం లేదని, కాపులను నెత్తిన పెట్టుకోనని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేష్‌ తదితరులు పాల్గొన్నారు.