జయసూర్య పై అభియోగాలు నమోదు చేసిన ఐసీసీ

SMTV Desk 2018-10-15 19:05:35  srilanka, sanath jayasurya, icc

హైదరాబాద్;ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసుర్యపై అభియోగాలు నమోదు చేసింది.ఐసీసీ యాంటి కరప్సన్ కోడ్ కింద జయసూర్య రెండు ఉల్లంఘనలకు పాల్పడినట్లు అభియోగాలు మోపింది.కాగా ఐసీసీ అవినీతి నిరోధక విభాగంలో కూడా జయసూర్య సహకరించడం లేదు అని వెల్లడించింది.కావున తమ పై వున్న అభియోగాలపై ఖచ్చితంగా అక్టోబర్ 15 నుంచి 14 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఐసీసీ తెలిపింది.అలాగే ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో వీటిపై తాము ఎలాంటి నిర్ణయాలు తీసుకోము అని పేర్కొంది.గతేడాది జయసూర్య నేతృత్వం లో శ్రీలంక జట్టు ప్రత్యర్థుల చేతుల్లో వోడిపోవడం వాళ్ళ చాల విమర్శలు వొచ్చినందుకు గాను రాజీనామా చేసాడు.జయసూర్య శ్రీలంక తరపున 110 టెస్టు లాడి 6,973 పరుగులు చేసాడు.2007 లో అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికిన సనత్ జయసూర్య 14 సెంచరీలు సాదించాడు.