ఏ నియోజకవర్గం లో ఎంతమంది వోటర్లు

SMTV Desk 2018-10-14 13:50:21  cm kcr,trs,telangan,

హైదరాబాద్;ఎన్నికల సంఘం ద్వార విడుదలైన వోటర్ల జాబితా ఆధారంగా ఇంటింటి ఎన్నికల ప్రచార ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎం కెసీఅర్ తమ అభ్యర్థులకు తెలిపారు.శనివారం తమ ఇంట్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యి వోటర్ల జాబితాలు పరిశీలించారు.ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది జాబితాలోని వోటర్ల సంఖ్యపై తమకొక స్పష్టత వచ్చిందని,ఏ నియోజకవర్గం లో ఎంతమంది వోటర్లు వున్నారనేది నేతలకు వాటిని అందజేయాలని సూచించారు.తరువాత శ్రీనివాసగౌడ్‌ (మహబూబ్‌నగర్‌), బాజిరెడ్డి గోవర్ధన్‌ (నిజామాబాద్‌ రూరల్‌), చల్లా ధర్మారెడ్డి (పరకాల), చింతా ప్రభాకర్‌ (సంగారెడ్డి), ప్రకాశ్‌గౌడ్‌ (రాజేంద్రనగర్‌), ప్రభాకర్‌రెడ్డి (మునుగోడు)లత ఫోన్ లో వోటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకొని ప్రచారం జరపాలని తెలిపారు.అలాగే ప్రతి వొక్క వోటర్ను కలిసే ప్రయత్నం చేయాలనీ ఆదేశించారు.