అభివృద్ధిని ఆపడం జగన్ కు అనితరసాధ్యం..

SMTV Desk 2017-05-30 17:06:03  lokesh, mahanadu, jagan, tdp, ysr cp

అమరావతి, మే 30 : ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ చేస్తున్న శరవేగమైన అభివృద్ది, సంక్షేమ రాజ్యం ఆవిష్కారాన్ని ఆపడం జగన్ కు ఆసాధ్యమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. మహానాడు మూడోరోజు ఆయన ప్రసంగించారు. ఆయన..ఆయన నేతృత్వంలోని దొంగ పేపర్ ఎంత అడ్డుగా వచ్చినా...అడ్డంగా పడుకున్నా...ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఏమాత్రం ఆపలేరని ప్రకటించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం చేపట్టినా అడ్డుకోవడానికి జగన్ సకల ప్రయత్నాలు చేస్తున్నారని, కాని అరచేతిని అడ్డు పెట్టి సూర్యుడ్ని ఆపడం ఎవరి తరం కాదని ఆయన అభివర్ణించారు. అనంతపురం లో కియె కార్ల కంపెనీని, విజయనగరం జిల్లా భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణాన్ని,తూర్పుగోదావరి జిల్లాలో ఫార్మకంపేనీల ఏర్పాటును, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా పుడ్ పార్కు నిర్మాణాన్ని, అమరావతిలో రాజధాని నిర్మాణానికి ఆయన శతవిధాల అడ్డుపడ్డారని, తన దొంగ పేపర్ ద్వారా నిరంతర ప్రయత్నాలు చేస్తూనే ఉంటారని విమర్శించారు.