`తార‌క్ ఎంత గొప్ప న‌టుడో

SMTV Desk 2018-10-13 17:05:48  Jr NTR ,akhil , TRIVIKRAM

మాట‌ల‌మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీయార్ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన చిత్రం `అర‌వింద స‌మేత‌`. ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఎన్టీయార్ న‌ట‌న‌, త్రివిక్ర‌మ్ ర‌చ‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. సినీ ప్ర‌ముఖులు కూడా `అర‌వింద స‌మేత‌`పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

తాజాగా అక్కినేని యంగ్ హీరో అఖిల్ కూడా `అర‌వింద సమేత‌` సినిమాను ట్విట‌ర్ ద్వారా ప్ర‌శంసించాడు. `తార‌క్ ఎంత గొప్ప న‌టుడో `అర‌వింద స‌మేత‌` చిత్రం మ‌రోసారి మ‌నంద‌రికీ గుర్తు చేస్తుంది. ఎన్టీయార్ న‌ట‌న అద్భుతం. ఈ విజ‌యానికి ఆయ‌న అర్హుడు. త్రివిక్ర‌మ్ గారి న‌మ్మ‌కానికి హ్యాట్సాఫ్‌. థ‌మ‌న్ ఈ సినిమాకు ప్రాణం పోశాడు. పూజా హెగ్డే న‌ట‌న‌, డ‌బ్బింగ్ అద్భుతం. చిత్ర‌బృందానికి అభినంద‌న‌లు. విజ‌యాన్ని ఆస్వాదించండి` అని అఖిల్ ట్వీట్ చేశాడు.