అర‌వింద స‌మేత.. ఫ‌స్ట్ డే ఎంత క‌లెక్ట్ చేసిందో తెలుసా..?

SMTV Desk 2018-10-13 11:02:12  Jr NTR , POOJA HEGDE , JAGAPATI BABU , TRIVIKRAM , THAMAN

యంగ్ టైగ‌ర్ నందమూరి తారక రామారావు - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం అర‌వింద స‌మేత‌..వీర రాఘ‌వ‌. భారీ అంచ‌నాల‌తో రిలీజైన ఈ చిత్రానికి బ్రహ్మాండమైన వసూళ్లు వస్తున్నాయి . తొలి రోజు నాన్ బాహుబలి రికార్డులు సృష్టించింది ఎన్టీఆర్ నటన కు అభిమానులు నీరాజనం పడుతున్నారు .దసరా సెలవులు కావడం తో మరో వారం రోజులు సినిమా బాగా ఆడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


ఇక తెలుగు రాష్ట్రాల్లో క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే.. నైజాం - 5.73 కోట్లు, సీడెడ్ - 5.30 కోట్లు, గుంటూరు 4.14 కోట్లు, కృష్ణ - 1.97 కోట్లు, నెల్లూరు - 1.06 కోట్లు, వెస్ట్ - 2.05 కోట్లు, ఈస్ట్ - 2.77 కోట్లు, ఉత్తరాంధ్ర - 3.12 కోట్లు, టోట‌ల్ ఆంధ్ర‌-తెలంగాణ‌లో క‌లిపి 26.14 కోట్లు, క‌ర్నాట‌క- 2.07 కోట్లు, ఆర్ఓఐ - 55ల‌క్ష‌లు, యుఎస్ఎ - 3.88 కోట్లు, ఆస్ట్రేలియా - 32 ల‌క్ష‌లు, యుఎఈ - 30 ల‌క్ష‌లు, ఆర్ఓడ‌బ్ల్యూ - 20 ల‌క్ష‌లు. టోట‌ల్‌గా అర‌వింద స‌మేత‌.. ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ - 33.49 కోట్లు సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.