తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి షాక్

SMTV Desk 2018-10-12 17:48:09  Tamil Nadu, Palini Swamy, Madras High Court

తమిళనాడు ,అక్టోబర్ 12 : తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి షాక్ తగిలింది. తన అనుచరులు, బంధువులకు లబ్ధి చేకూరేలా రోడ్డు కాంట్రాక్టులను పళనిస్వామి అప్పజెప్పారనే కేసును మద్రాస్ హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. పళనిస్వామిపై ప్రతిపక్ష డీఎంకే చేసిన ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ విభాగం ఈ కేసును విచారించింది. ఎలాంటి అవకతవకలు జరగలేదంటూ పళనికి క్లీన్ చిట్ ఇచ్చింది. డీఎంకే ఆరోపణల్లో నిజం లేదని తేల్చింది. ఈ నేపథ్యంలో డీఎంకే హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన జడ్జి ఏడీ జగదీష్ ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు తెలిపారు. విచారణ పారదర్శకంగా జరాగాలనే ఉద్దేశంతోనే సీబీఐకి అప్పగిస్తున్నట్టు చెప్పారు. వారం రోజుల్లోగా డాక్యుమెంట్లన్నింటినీ సీబీఐకి అప్పగించాల్సిందిగా విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు. ముఖ్యమంత్రి పళనిస్వామికి షాక్ తగిలింది. తన అనుచరులు, బంధువులకు లబ్ధి చేకూరేలా రోడ్డు కాంట్రాక్టులను పళనిస్వామి అప్పజెప్పారనే కేసును మద్రాస్ హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. పళనిస్వామిపై ప్రతిపక్ష డీఎంకే చేసిన ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ విభాగం ఈ కేసును విచారించింది. ఎలాంటి అవకతవకలు జరగలేదంటూ పళనికి క్లీన్ చిట్ ఇచ్చింది. డీఎంకే ఆరోపణల్లో నిజం లేదని తేల్చింది. ఈ నేపథ్యంలో డీఎంకే హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన జడ్జి ఏడీ జగదీష్ ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు తెలిపారు. విచారణ పారదర్శకంగా జరాగాలనే ఉద్దేశంతోనే సీబీఐకి అప్పగిస్తున్నట్టు చెప్పారు. వారం రోజుల్లోగా డాక్యుమెంట్లన్నింటినీ సీబీఐకి అప్పగించాల్సిందిగా విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు.