నారా భువనేశ్వరి గా మంజిమ

SMTV Desk 2018-10-12 17:16:47  NTR BIOPIC , BALAKRISHNA , MANJIMA , KRISH

బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. బాలయ్య స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్న విషయం తెలిసిందే. నారా చంద్రబాబు నాయుడి పాత్రలో రానా నటిస్తుండగా ఆయన సతీమణి భువనేశ్వరి పాత్ర కోసం కథానాయిక మంజిమా మోహన్‌ను ఎంపిక చేశారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్యకు జోడీగా ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో నటించిన ఆమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ కోసం మంజిమాను ఎంపిక చేశాడు దర్శకుడు క్రిష్. నారా భువనేశ్వరి పాత్రకు ఆమె సరిగ్గా సరిపోతుందని తీసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆబిడ్స్‌లోని ఎన్టీఆర్ ఇంట్లో జరుగబోయే షెడ్యూల్‌లో మంజిమా పాల్గొనబోతున్నట్లు తెలిసింది. కీలకమైన భువనేశ్వరి పాత్రలో నటించే అవకాశం రావడం పట్ల మంజిమా మోహన్ ఎంతో సంతోషంగా ఉంది. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నాడు.