స్కాట్లాండ్ ను వణికిస్తున్న వింత జంతువు

SMTV Desk 2017-07-20 11:03:01  SCORTH LAND, ANIMAL, WONDER, VIRAL VIDEO, TORTOISE, DINOPSAAR

స్కాట్లాండ్, జూలై 20 : ఓ వింత జంతువు స్కాట్లాండ్ లోని గ్రామ ప్రజలలో భయాందోళనలు కలిగిస్తోంది. ఈ జంతువును జిమ్మీ రైట్ అనే వ్యక్తి ‌.. స్కాట్లాండ్‌ పశ్చిమ స్టెర్లింగ్‌ షైర్‌లోని కెల్లెర్న్‌ గ్రామం స్కాటిష్‌ ఫీల్డ్‌లో చూసి కెమెరాలో బంధించాడు. ఆ ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఆ జంతువు ఏంటో అర్ధం కాక జనాలు తెగ ఆలోచిస్తున్నారు. అది తాబేలు అని కొందరంటే, కాదు అది మాంసాహారి అని మరికొందరు భయపడుతున్నారు. రైట్ తన పెంపుడు కుక్కను బయటకు తీసుకెళ్ళిన సమయంలో ఈ వింత జంతువు కౌ ఫీల్డ్ లో దర్జాగా నడుచుకుంటూ వెళ్తుంటే ఫోటో తీశానని, మొదట ఆ జీవిని చూసి తను షాక్ కి గురైనట్లు తెలిపారు. అది అచ్చం డైనోసార్ ను పోలి ఉండడంతో భయపడి వెంటనే ఆ ప్రాంతం నుంచి ఇంటికి వచ్చేసినట్లు వెల్లడించారు.