అతి కిరాతంగా నరికి చంపిన భర్త ?

SMTV Desk 2018-10-11 15:40:17  Kadapa,Ventakataramana,killed wife

కడప ,అక్టోబర్ 11: కడప జిల్లా సంబేపల్లెలో దారుణం ,భార్యను భర్త అతి కిరాతంగా నరికి చంపాడు. భార్య తలని నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. భార్య వేరె వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే దీనికి కారణం అని హంతకుడు తెలిపాడు .

వివరాల్లోకి వెళితే :భర్త వెంటకటరమణ కుటుంబ పోషణ నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లి డబ్బులను సంపాదించి భార్య రాణికి పంపిస్తుండేవాడు. కొంతకాలానికి తన భార్య పై అనుమానంతో గల్ఫ్ దేశం నుంచి గ్రామానికి వచ్చాడు . భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని డబ్బులను విలాసాల పేరుతో తగలెట్టిందని తెలుసుకుని ఆగ్రహంతో రగిలిపోయాడు .

సమయం చూసి భార్యపై అనుమానంతో రగిలిపోతున్న వెంటకటరమణ చంపాలన్నఓ తుది నిర్ణయానికి వచ్చాడు. మంగళవారం సాయంత్రం బైకుపై ప్రియుడుతో కలిసి రాణి వెళ్తుండగా వెంకటరమణ వారిని వెంబడిస్తూ దుద్యాల చెక్ పోస్ట్ వద్ద అడ్డుకొని రాణిని కొడవలితో నరికేశాడు. సంఘటనను చూసిన ప్రియుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు . నరికిన తలతో వెంకటరమణ నేరుగా సంబేపల్లె పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.