దూకుడుమీదున్న ‘అరవింద సమేత’!

SMTV Desk 2018-10-11 15:22:51  

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ సినిమా రేపు విడుదల కానుండగా ఈరోజు రాత్రి నుండే ప్రీమియర్ల షో వెయబడుతుంది. అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు చాలా మంది ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజ్ మూలంగానే యూఎస్ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సినిమాలని సైతం వెనక్కి నెట్టి ‘అరవింద సమేత’ తన సత్తా చాటుతోంది.

ఇప్పటి వరకు 150 లొకేషన్ల నుండి 368,162 డాలర్లను రాబట్టిన ఈ సినిమా మొదటి రోజు మిలియన్ డాలర్ మార్కును ఈజీగా క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక హిట్ టాక్ వస్తే వసూళ్లు కూడ ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఉత్తమమైన వసూళ్లుగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పూజ హెగ్డే కథానాయకిగా నటించగా జగపతిబాబు ప్రతినాయకుడి పాత్ర పోషించారు. నాగబాబు తండ్రి పాత్రలో కనిపించనున్నారు. హీరో సునీల్‌ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.