ఇంద్రకీలాద్రి ముస్తాబైంది..!!

SMTV Desk 2018-10-11 14:37:49  Vijayawada Indrakeeladri,Anatomical exposition,kakadurgarham

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ కమిటీ.. మిరుమిట్లు గొలిపే విద్యుద్దీప కాంతులతో దుర్గమ్మ ఆలయాన్ని ముస్తాబు చేసి అంగరంగ వైభవంగా దేవి నవరాత్రులకు శ్రీకారం చుట్టారు . మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గమ్మగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చి ,వారి సర్వ దోషాలను తొలగించారు . కాగా.. అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో భక్తులు భారీగా విచ్చేసారు .పది రోజుల్లో అమ్మవారు వోక్కోరోజు వోక్కో అలంకారంలో దర్శనమిచ్చి భక్తులను పర్వసోపేతం చేస్తారు . వోక్కో అలంకారానికి వోక్కో ప్రత్యేకత ఉంటుంది . స్వర్ణకవచాలంకృత కనకదుర్గ,బాలా త్రిపురసుందరీ దేవి, గాయత్రీ దేవి, అన్నపూర్ణాదేవి, లలితా త్రిపుర సుందరీదేవి, మహాలక్ష్మి, సరస్వతీ దేవి, కనకదుర్గ, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు.ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ప్రభుత్వం భారీగా బందోబస్తు ఏర్పాటు చేసింది .