అమెరికాలో భారతీయులకు రెండు అవార్డులు

SMTV Desk 2017-07-20 10:02:43  amerikaa, vashington, first robotic olampiyaad, rakesh team, gold medal, trump

వాషింగ్టన్, జూలై 20 : అమెరికాలోని వాషింగ్టన్‌లో మూడు రోజులపాటు నిర్వహించిన ‘తొలి రోబోటిక్‌ ఒలింపియాడ్‌’ అంతర్జాతీయ పోటీల్లో 157 దేశాల విద్యార్థులు పాలుపంచుకున్నారు. ఈ పోటీల్లో భారత విద్యార్థుల బృందం రెండు అవార్డులు గెలుచుకుంది. ముంబై కి చెందిన 15 ఏళ్ళ రాకేష్ నేతృత్వంలోని బృందం హాజరయ్యారు. ఇందులో ఆదివ్ షా, హరీష్ భట్, వాట్సిన్, ఆధ్యన్, తేజస్, రాఘవ్ లు సభ్యులుగా ఉన్నారు. వీరు ప్రదర్శించిన "షెంగ్‌ హెంగ్‌ ఇంజినీరింగ్‌ డిజైన్" కు బంగారు పతకం రాగా, "గ్లోబల్ ఛాలెంజ్ మ్యాచ్ డిజైన్" లు కాంస్య పతకం గెలుచుకున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పోటీలు జరిగాయని రాకేష్ బృందం ఆనందం వ్యక్తం చేశారు. విజేతలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ తో కలిసి అభినందించారు. కాగా వచ్చే ఏడాది ఈ పోటీలు మెక్సికో సిటీ లో జరగనున్నాయి.