అందుకె అలా ఫిక్స్ అయ్యా !

SMTV Desk 2018-10-10 17:55:44  akkineni samantha

సౌత్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతోంది. పెళ్లయిన తర్వాత ఆమె గ్లామర్ రోల్స్ తగ్గించింది. తనకు తగిన పాత్రలనే ఆమె ఎంపిక చేసుకుంటోంది. సబ్జెక్ట్‌లు ఎంచుకోవడంలో పాటిస్తున్న జాగ్రత్తల వల్ల ఆమె కొన్ని సినిమాలను చేయలే కపోతోంది. ఇటీవల ‘యూ టర్న్’ మూవీతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే తనకు నచ్చే, ఛాలెంజింగ్‌గా ఉండే పాత్రలతో ఎవరైనా తనకు ఆఫర్ ఇవ్వగలిగితే… రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి సిద్ధమేనని చెప్పింది సమంత. రోల్ నచ్చితే మాత్రం తన పారితోషికాన్ని తగ్గించేసి సినిమా చేసేందుకు రెడీ అని అంటోంది. తన కెరీర్‌లో మరచిపోలేని సినిమాలు ఉండిపోవాలనే లక్షంతోనే సమంత ఈ నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు.