‘ఎన్‌టిఆర్ ’ బయోపిక్ : రకుల్ ఫస్ట్ లుక్ విడుదల

SMTV Desk 2018-10-10 12:46:41  Balakrishna , Rakul preet singh , krish , keeravani

హైదరాబాద్ : క్రిష్ దర్శకత్వంలో ఎన్‌టిఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే . ఎన్‌టిఆర్ పాత్రలో ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ , ఎన్‌ఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు. ఎన్‌టిఆర్‌తో పలు హిట్ చిత్రాల్లో నటించిన దివంగత శ్రీదేవి పాత్రలో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. రకుల్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. శ్రీదేవి పాత్రలో నటించడం తనకు ఓ సవాల్ వంటిదని రకుల్ చెప్పిన విషయం తెలిసిందే. శ్రీదేవి పాత్రకు న్యాయం చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఎన్‌టిఆర్ సినిమా ప్రస్తుతం కృష్ణా జిల్లా దివి సీమలో షూటింగ్ జరుపుకుంటుంది. ఇంకా ఈ సినిమాలో పలువురు ప్రముఖులు నటిస్తున్నారు. ఎపి సిఎం చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా, చంద్రబాబు భార్య భువనేశ్వరి పాత్రలో మలయాళ నటి మంజిమా మోహన్, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్, హెచ్‌ఎంరెడ్డి పాత్రలో నటుడు కైకాల సత్యనారాయణ , దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్రలో భరత్‌రెడ్డి, ఎన్‌టిఆర్ కుమార్తె పురందేశ్వరిగా హిమాన్సీ, ఎస్‌విఆర్ పాత్రలో నాగబాబు నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.