ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు.....

SMTV Desk 2018-10-10 11:37:43  Andhra Pradesh, AP CM Chandra babu, AP CM Chandrababu prestigious award,Delhi

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబుకు గ్లోబల్ అగ్రికల్చర్‌ లీడర్‌ షిప్‌ అవార్డు దక్కింది. ఈ నెల 24న ఢిల్లీలో కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్ చేతుల మీదుగా చంద్రబాబు ఈ అవార్డును అందుకోనున్నారు. వ్యవసాయ విధానం, రైతులకు ప్రోత్సాహాలు, పరిశోధన, పంటల అభివృద్ధి,నాయకత్వం అంశాలను అవార్డు ఎంపిక కమిటీ అయిన డాక్టర్ స్వామినాథన్ కమిటీ పరిశీలించింది. సాగునీరు, ప్రకృతి వ్యవసాయం,వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటెంగ్‌ వంటి అంశాలను కూడా ఈ కమిటీ పరిగణనలోకి తీసుకుంది. ప్రతి అంశంలో ఏపీ అగ్రగామిగా ఉన్నట్లు తేల్చిన కమిటీ ఈ అవార్డుకు ఏపీ ముఖ్య మంత్రి అయినా చంద్ర బాబు ను ఎంపిక చేసింది .