సర్వే పేరుతో జనాన్ని మైమరిపించే ప్రయత్నం...

SMTV Desk 2017-05-30 17:01:05  suravaram sudhakar reddy,cpi gs, kcr

హైదరాబాద్, మే 30 : ముఖ్యమంత్రి కేసిఆర్ సర్వే పేరుతో జనాన్ని మైమరిపించే ప్రయత్నం చేస్తున్నారని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు.తమకు అనుకూలంగా ఉందని సర్వేల పేరుతో ప్రజల దృష్టిని...వారి అభిప్రాయలను మార్చడం ఎవరి తరం కాదని ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్వహించిన సర్వే ..ఆయనే పరీక్ష వ్రాసి ..ఆయనే మార్కులు వేసుకున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ 52 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో పాల్గోన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పారు.తన మాటలు వ్యక్తిగత అభిప్రాయంగానే భావించాలని..ఎప్పుడో వచ్చే ఎన్నికలపై ఇప్పుడే మాట్లాడటం మూర్ఖత్వం అవుతుందని వివరించారు.