అరవింద సమేత 92 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్

SMTV Desk 2018-10-09 12:10:13  Aravinda Sametha, NTR, Pre Release Business

ఎన్.టి.ఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత ఈ నెల 11న రిలీజ్ కాబోతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ నిమ్రించిన ఈ సినిమాలో పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటించారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఎన్.టి.ఆర్ ఈ సినిమా బిజినెస్ లో దుమ్మురేపుతున్నాడు.

ఎన్.టి.ఆర్ కెరియర్ లో హయ్యెస్ట్ బిజినెస్ చేస్తుంది అరవింద సమేత 92 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా మొత్తం బడ్జెట్ ఖర్చుతో బిజినెస్ ఈక్వల్ అయ్యిందట. ఇక శాటిలైట్, డబ్బింగ్ ఇతరత్రా కలిపి మరో 40 కోట్ల దాకా వచ్చాయట. సో సినిమా రిలీజ్ కు ముందే రాధాకృష్ణ ప్రాఫిట్స్ అందుకున్నాడని అంటున్నారు. పోటీలో స్టార్ సినిమా లేదు కాబట్టి అరవింద సమేత నిజంగానే అదిరిపోయే కలక్షన్స్ వసూళు చేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.