కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు

SMTV Desk 2018-10-09 12:06:52  Congress, rahul Gandhi, Congress Election campaign

తెలంగాణా కాంగ్రెస్‌ నేతలు ఈనెల 4న ఆలంపూర్ లో జోగుళాంబ దేవాలయంలో పూజలు చేసి గద్వాల్ లో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. మళ్ళీ రెండవ విడత ఎన్నికల ప్రచారానికి షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ నెల 10న మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నారు. ఆ తరువాత నల్గొండ, ఖమ్మం జిల్లాలలో వారం రోజులపాటు వరుసగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

రెండు రోజులు విరామం తరువాత మళ్ళీ 20,21 తేదీలలో ఖమ్మం జిల్లాలో మిగిలిన నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మళ్ళీ రెండు రోజులు విరామం తీసుకొని 24 నుంచి 26 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మళ్ళీ 28న కరీంనగర్ నుంచి ప్రచారం ప్రారంభించి నవంబరు2న భూపాలపల్లిలో ఈ రెండవ విడత ఎన్నికల ప్రచారం ముగిస్తారు. మొత్తం 18 రోజులలో 59 నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు.