ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి సినిమా డీటైల్స్

SMTV Desk 2018-10-09 11:05:07  Jr NTR, rajamouli, Ram charan,

బాహుబలి తర్వాత రాజమౌళి చేయబోతున్న మల్టీస్టారర్ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ అంటూ చరణ్, ఎన్.టి.ఆర్ మూవీ ఎనౌన్స్ చేసిన నాటి నుండి సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అటు మెగా ఇటు నందమూరి ఫ్యాన్స్ ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ నుండి మొదటి షెడ్యూల్ మొదలవుతుందని తెలుస్తుంది.

అయితే ఈ సినిమా కోసం హీరోలిద్దరు వర్క్ అవుట్స్ చేయాల్సి ఉందట. చరణ్ పోలీస్ గా.. ఎన్.టి.అర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారట. పిరియాడికల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా కోసం చరణ్, ఎన్.టి.ఆర్ వర్క్ అవుట్స్ మొదలు పెట్టనున్నారట. వారి పాత్రలకు కావాల్సిన పర్ఫెక్ట్ లుక్ తో పాటుగా పాత్ర స్వభావాలను ముందే నిర్ణయించుకుని సెట్స్ మీదకు వెళ్తారట.

మొదట 150 కోట్ల బడ్జెట్ అనుకున్న ఈ సినిమాను 300 కోట్ల బడ్జెట్ తో తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ సినిమా రూపొందించాలని చూస్తున్నారట. బాహుబలి తర్వాత జక్కన్న చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.