మితంగా తగ్గిన పెట్రోలు ధరలు!!

SMTV Desk 2018-10-06 16:42:37  delhi, Arun Jaitley,petrol

దిల్లీ,అక్టోబర్ 06: భారీగా పెరిగిన చమురు ధరలపై కేంద్రం తగ్గింపు ధరల చర్యలు చేపట్టింది. లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2.50 చొప్పున ఎక్సైజ్‌ పన్ను తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతు గతంలో పెట్రోల్‌ ధరలు పెరిగినప్పుడు రూ.2 ఎక్సైజ్‌ పన్ను తగ్గించామని గుర్తు చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరుగుతున్నాయని గమనించి ద్రవ్యలోటు తగ్గించేందుకు కృషి చేస్తున్నామని ఆయన వివరించి చెప్పారు . ద్రవ్యోల్బణం 4 శాతం లోపే ఉందని, మొదటిభాగంలో 8.2 శాతం వృద్ధిరేటు నమోదైందని జైట్లీ తెలిపారు. చమురు ధరలపై రాష్ట్రాలు కూడా కొంత పన్నులు తగ్గించుకోవాలని సూచించి , రూ.5 తగ్గించాలని అనుకున్నప్పటికీ సాధ్యపడటం లేదని ఆయన వెల్లడించారు. అయినా ఇన్నిరోజులు దీన్ని పట్టించుకోని కేంద్రం ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.