స్కర్ట్ వల్ల అరెస్ట్ అయిన యువతి

SMTV Desk 2017-07-19 17:06:09  dubai, girl, skirt, police case, social media, viral video.

దుబాయ్, జూలై 19 : ముస్లిం దేశాల్లో మహిళలకు వారు వేసుకునే దుస్తుల నుంచి చేసే ప్రతి పనిలో కూడా కొన్ని కట్టుబాట్లు నియమనిబంధనలు ఉంటాయి. అలాంటి దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియాలో ఒక యువతి స్కర్ట్ ధరించిందని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలలోకి వెళితే...ఓ యువతి స్కర్ట్, టాప్ ధరించి నిర్మానుష్యంగా ఉన్న ఒక గ్రామంలోని వీధుల్లో తిరుగుతున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆ వీడియో లో యువతి ఎక్కువసేపు వెనుకకు తిరిగే ఉంది. ఒకటి, రెండు సార్లు మాత్రమే ఆమె తన ముఖాన్ని కెమెరాకు చూపించింది. కాగా కొందరు ఆ యువతి కనిపించిన ప్రదేశాన్ని సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ శివారులోని చారిత్రక ఉషౌఖిర్‌గా గుర్తించారు. ఈ విషయం కాస్త రియాద్ పోలీసులదాక వెళ్ళగా వారు ఆ యువతిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు అధికారిక మీడియా పేర్కొంది. ఆమెను కోర్టులో హాజరుపర్చనున్నారు. కాగా సౌదీలో మహిళల దుస్తులపై కొన్ని ఆంక్షలు ఉంటాయి. వారు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులనే ధరించాల్సి ఉంటుంది. అంతేగాక, అక్కడ మహిళలు డ్రైవింగ్‌ చేయడం కూడా నిషేధం.