‘నోటా’ ప్రమోషన్‌లలో విజయ్ దేవరకొండ

SMTV Desk 2018-10-02 09:53:44  NOTA Promotions, Vijay Devarakonda,

నటుడు విజయ్ దేవరకొండకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. విజయ్ ప్రస్తుతం ‘నోటా’ ప్రమోషన్‌లలో చాలా బీజీగా ఉన్నాడు. విజయ్, విజయవాడలో ఉన్న అభిమానుల కోసం ‘పబ్లిక్ మీట్’ను ఏర్పాడు చేశాడు. ఆ కార్యక్రమానికి విజయ్‌తో పాటుగా నటి మెహ్రీన్ కౌర్ కూడా వెళ్లింది. దీంతో తనను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున వచ్చారు. కానీ కార్యక్రమం మాత్రం చిన్న హాల్‌లో ఏర్పాటు చేశారు. దీంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. వేలాదిమంది హాల్ బయటనే ఉండిపోయారు. అభిమానుల ఇబ్బందిని గమనించిన విజయ్ వారికి క్షమాపణ చెప్పాడు. ‘బయట ఉన్నవాళ్లను చూడలేకపోతున్నాను. నన్ను క్షమించండి. మళ్లీ వచ్చినప్పడు పెద్ద హాల్‌ను ఏర్పాటు చేస్తాను. ఇంత చిన్న హాల్ సరిపోవడం లేదు. అందుకే క్షమాపణ చెబుతున్నాను. అందరు జాగ్రత్తగా ఇళ్లకు వెళ్లండి’ అని విజయ్ అన్నాడు. విజయ్ చాలా రోజుల తర్వాత విజయవాడకు వచ్చినట్టు తెలిపాడు. విజయవాడ ప్రజలకు సినిమా, రాజకీయాలంటే ఎంతో ఇష్టమని, ఆ రెండు అంశాలు ‘నోటా’ సినిమాలో ఉంటాయని చెప్పాడు. మరో నాలుగు రోజుల్లో థియేటర్లలో కలుసుకుందామని అన్నాడు