ప్రభాస్‌ నెక్ట్స్‌ మూవీ

SMTV Desk 2018-09-30 17:32:56  Prabhas, Prabhas next movie,

బాహుబలి సినిమాతో అంతర్జాతీజయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం ‘సాహో’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే ప్రభాస్‌ మరో సినిమాను ప్రారంభించే పనిలో ఉన్నాడు. ఇప్పటికే తన తదుపరి చిత్రం జిల్‌ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో ఉంటుందని ప్రకటించాడు ప్రభాస్‌. ఇటీవల లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు. పీరియాడిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను ఇటలీలో షూట్‌ చేయనున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్‌తో పాటు ప్రభాస్‌ కూడా ఇటలీ చేరుకున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు రాధకృష్ణ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.