వేగవంతమైన భారత ఆర్థిక వృద్ధి..

SMTV Desk 2017-05-30 16:57:29  financial groth,speed financial groth

న్యూ ఢిల్లీ, మే 29 :భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన ఆర్థిక వృద్దిని నామోదు చేస్తోంది. ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలువ నుందని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం వృద్ధిరేటును నామోదుచేస్తుందని స్పష్టమైన అంచనాలు వెల్లడించింది. అదే విధంగా 2019-20 నాటికి 7.7 శాతం వృద్ది రేటు కు చేరుకుంటుందని స్పష్టం చేశారు. బలమైన ఫండమెంటల్స్,పెట్టుబడుల తీరు మెరుగుపడుతుండడం, సంస్కరణల వాతావరణాన్ని సానుకూలతలుగా ప్రపంచ బ్యాంక్ స్పష్టం చేసింది. మహిళల భాగస్వామ్యాన్ని మరింతపెంచితే రెండంకేల వృద్ది రేటు సాధన దిశగా సాగిపోవచ్చునని సూచనలు చేసింది. ఈ మేరకు ఇండియా డెవలప్ మెంట్ రిపోర్ట్ ను ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. గత సంవత్సరం చక్కని వర్షపాతం తర్వాత పరిస్థితులు మెరుగుపడుతుండగా పెద్దనోట్లను రద్దు చేస్తు తీసుకున్న నిర్ణయం భారత వృద్దికి విఘాతం కల్గించిందని రిపోర్టులో పెర్కోంది. ఇకపైన ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుందని, జిఎస్ టి అమలు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని వివరించారు. డిగ్రి చదివిన మహిళల్లో 65 శాతం మంది పని చేయడం లేదని , మహిళల పాత్ర పెరగాల్సిన అవసరం ఉందని వివరించారు.