మొబైల్‌లో టాక్సీవాలా సినిమా

SMTV Desk 2018-09-30 13:36:40  Mobiles, Taxiwala Movie, Taxiwala Movie leaked

ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన గీత గోవిందం సినిమా పైరసీ భారిన పడటంతో ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. అదే సమయంలో విజయ్‌హీరోగా తెరకెక్కిన మరో సినిమా టాక్సీవాలా కూడా పైరసీకి గురైనట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమే అని తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి లో కొంత మంది ఆకతాయిలు మొబైల్‌లో టాక్సీవాలా సినిమా చూస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.