నిధి అగర్వాల్ అందాల విందు

SMTV Desk 2018-09-30 11:03:06  nidhi aggarwal, naga chaitanya,

హీరోయిన్‌ నిధి అగర్వాల్ ప్రస్తుతం తెలుగులో అక్కినేని యంగ్‌ హీరోలు నాగచైతన్య మరియు అఖిల్ లతో విడి విడిగా నటిస్తున్న విషయం తెల్సిందే. నాగ చైతన్యతో ‘సవ్యసాచి’ చిత్రంలో నటించిన నిధి అగర్వాల్ ఆ తర్వాత అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలో నటిస్తోంది. మరో వైపు బాలీవుడ్లో కూడా ఈ అమ్మడు నటిస్తూనే మోడలింగ్ కూడా చేస్తూ ఉంటుంది. తాజాగా జిక్యూ నిర్వహించిన ఒక అవార్డు వేడుకలో నిధి అగర్వాల్ పాల్గొంది. రెడ్ కార్పెట్పై వాక్ చేసిన ఈ అమ్మడు తన అందాలు ఆరబోయడంతో కెమెరామెన్లు తమ కెమెరాలకు పని చెప్పారు. హిందీలో కేవలం ఒక్క చిత్రంలో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ భామ తెలుగులో ఒకేసారి రెండు సినిమాలో అదీ కాకుండా అక్కినేని హీరోల సరసన నటించే అవకాశం రావడం చాలా అరుదైన విషయంగా చెప్పుకోవాలి. భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందిన ఈ రెండు సినిమాలు కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి.