విజయ్‌ దేవరకొండ @ త‌మిళ బిగ్‌బాస్‌

SMTV Desk 2018-09-30 10:01:41  Vijay Devarakonda, Tamil Bigg Boss, Nota Promotions

తెలుగు బిగ్ బాస్‌లో సంద‌డి చేసిన టాలీవుడ్‌ సెన్సేషన్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ.. ఇప్పుడు త‌మిళ బిగ్‌బాస్‌లో అడుగు పెడుతున్నాడు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ద్విభాష చిత్రం ‘నోటా’ సినిమా ప్రమోషన్‌ కోసం విజయ్‌ తమిళ బిగ్‌బాస్‌ షోకు వెళ్లాడు. లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ అక్క‌డి బిగ్‌బాస్‌ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ షోకు వెళ్లి.. అక్క‌డ స్టేజ్ పై త‌న సినిమాను ప్ర‌మోట్ చేసుకునే అవ‌కాశం విజ‌య్ దేవ‌ర‌కొండ‌కే ద‌క్కింది. అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానున్న ‘నోటా’ సినిమాను త‌మిళ బిగ్‌బాస్ లో ప్రమోట్ చేసుకున్నాడు విజయ్‌ దేవరకొండ‌. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమా ఒకేసారి విడుద‌ల కానుంది. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రంలో విజయ్‌కి జంటగా మెహరీన్‌ నటిస్తుంది.