"96" రైట్స్ సొంతం చేసుకున్న దిల్ రాజు

SMTV Desk 2018-09-29 16:42:36  Dil raju, trisha, 96 rights,

కోలీవుడ్ లో కాన్సెప్ట్ సినిమాలకు కొరవే లేదు.. అక్కడ ఆడియెన్స్ ఎక్కువ అలాంటి సినిమాలకే ఓటేస్తారు. తెలుగు ఆడియెన్స్ కూడా కాన్సెప్ట్ సినిమాలు మెప్పు పొందినా ఓ కమర్షియల్ పంథాలోనే వాటిని సాగిస్తారు. లేటెస్ట్ గా అలాంటి కాన్సెప్ట్ సినిమా తమిళంలో వస్తుంది. అదే 96. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 4న రిలీజ్ కాబోతుంది. సినిమా టీజర్, ట్రైలర్ చూసిన దిల్ రాజు ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కులు కొనేశారట. సినిమా రిలీజ్ కాకుండానే రిజల్ట్ ఊహించిన దిల్ రాజు త్వరలోనే ఆ రీమేక్ సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని తెలుస్తుంది. రొమాంటిక్ థ్రిల్లర్ జానర్ సినిమాగా వస్తున్న 96 సినిమాలో టైటిల్ లో కూడా సస్పెన్స్ ఉంటుందని తెలుస్తుంది. ఇక ఆ న్యూస్ బయటకు రావడమే ఆలస్యం. నాని, సమంత కలిసి ఈ సినిమా చేస్తున్నారని వార్తలు రాసేస్తున్నారు. పెళ్లి తర్వాత సమంత కొత్త ఉత్సాహంతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు ఓటేస్తుంది. అయితే ఈ వార్తలపై దిల్ రాజు స్పందించి రైట్స్ కొన్న విషయం నిజమే కాని కాస్టింగ్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నాడు. సో నాని, సమంత అంటూ వస్తున్న వార్తలన్ని నిజం కాదని తేలిపోయింది.