హరీశ్ రావుకు తప్పిన ప్రమాదం

SMTV Desk 2018-09-29 13:37:32  Minister Harish Rao, TRs Minister Harish Rao

తెరాస నేత, మంత్రి హరీశ్ రావుకు సంగారెడ్డి పట్టణంలో ప్రమాదం తప్పింది. తెరాస కార్యకర్తలు హరీశ్ రావుకు స్వాగతం చెబుతున్న తరుణంలో ఒక్కసారిగా బాణాసంచా చెల్లాచెదురుగా పేలింది. దీంతో దాదాపు మూడు నిమిషాల పాటు దట్టమైన పొగకమ్ముకోవడంతో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అప్రమత్తమైన మంత్రి సెక్యూరిటీ, కార్యకర్తలు ఆయనకు రక్షణగా నిలిచారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సంగారెడ్డి పట్టణంలో ముఖ్యకార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొనేందుకు వచ్చారు.