ఆ నలుగురికి నోటీసులు పంపడం మంచి పరిణామం

SMTV Desk 2017-07-19 15:28:44  Sending, notices, to, the, four, is, a good, evolution

అమరావతి, జూలై 19 : ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీ లోకి వెళ్లిన ఈ నలుగురికి హైకోర్టు నోటీసులు ఇవ్వడం మంచి పరిణామమే అని అంబటి రాంబాబు అన్నారు. అంబటి రాంబాబు మీడియా తో మాట్లాడుతూ... వైసీపీ పార్టీ కి 21 మంది ఎమ్మెల్యే లు రాజీనామా చేయకుండానే టీడీపీ లో చేరారు. చేరిన ఎమ్మెల్యే లపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేయాలి. పార్టీ మారిన ఎమ్మెల్యే లు అందరు రాజీనామా చేసి మళ్లీ ఎమ్మెల్యే గా పోటి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపుల కేసులో మంత్రులు అమర్ నాథరెడ్డి, అఖిల ప్రియ, సుజయ్ కృష్ణ, అది నారాయణ రెడ్డి, రంగనాథ లకు మంగళవారం రోజున హైకోర్టు నోటీసులు జారీ చేసింది.