క్లైమాక్స్ మార్చే విషయంలో చిరు ప్రమేయం

SMTV Desk 2018-09-29 10:09:52  Sye raa Narasimhareddy,sye raa climax changed

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా వస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం జార్జియాలో యుద్ధ సన్నివేశాలను షూటింగ్ జరుపుకుంటుంది. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కహతో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈమధ్యనే రిలీజైన సైరా టీజర్ సినిమా రేంజ్ పెంచింది. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటుగా తమిళ, హింది భాషల్లో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమా ముగింపు గురించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నరసింహా రెడ్డిని కోట ఎదుట బ్రిటీష్ వారు ఉరి తీశారు. అయితే అదే క్లైమాక్స్ పెడితే మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే నరసింహా రెడ్డి మరణంతో ముగించకుండా ఆ తర్వాత స్వాతంత్ర ఉద్యమాన్ని మొదలుపెట్టిన వారి గురించి కూడా చూపించబోతున్నారట. క్లైమాక్స్ మార్చే విషయంలో చిరు ప్రమేయం కూడా ఉందని తెలుస్తుంది. 2019 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో నయనతార, అమితాబ్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు.