టాలీవుడ్ ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా వెండితెరకు పరిచయమైనా.. నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు రామ్‌చరణ్. ‘చిరుత’ తో మొదలైన చరణ్ సినీ కెరీర్లో ‘మగధీర’ మైలురాయిగా నిలిచింది. ధృవ, రంగస్థలం సినిమాలు చరణ్‌ను నటుడిగా ఓస్థాయికి తీసుకెళ్లాయి. రామ్‌చరణ్ తన నటప్రస్థానానికి ఈ రోజుతో 11సంవత్సరాలు పూర్తి అయింది ఈ సందర్భంగా చరణ్ తన ఈ విజయానికి కారణమైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘ఇప్పటికే 11 ఏళ్లు పూర్తి అయ్యాయంటే నమ్మలేకపోతున్నా. నిన్నే నటించడం ప్రారంభించిన ఫీలింగ్‌లో ఉన్నా. మీరు చూపిన ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు. నా ఈ ప్రయాణంలో భాగస్వాములైన దర్శకులు, నిర్మాతలు, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. గౌరవంగా ఉంది. లవ్ యూ ఆల్’ అని ఆయన పేర్కొన్నారు.
Can’t believe it’s been 11yrs already.
— Upasana Kamineni (@upasanakonidela) September 28, 2018
Feels like it was just yesterday that I started acting.Thank you for all the love and adoration.A big thank you to all my directors, producers & everyone that has been part of my journey. Humbled,blessed & honoured. Love u all!! #ramcharan pic.twitter.com/Ui3jnHKQM1