నోటా సినిమా ఎవరు చేయాలో తెలుసా ?

SMTV Desk 2018-09-28 18:10:24  Nota Movie, Vijay devarakonda, Allu arjun

విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా నోటా. స్టూడియో గ్రీన్ బ్యానర్ లో జ్ఞానవెల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమా తమిళంతో పాటుగా తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 5న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా కథ జ్ఞానవెల్ రాజా ముందు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు వినిపించాడట. బన్ని నో చెప్పడంతో విజయ్ దగ్గరకు సినిమా వెళ్లిందట. విజయ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ గీతా గోవిందం సినిమా కూడా దర్శకుడు పరశురాం మొదట బన్నికే చెప్పాడట. ఇది తనకన్నా వేరే వాళ్లకు బాగుంటుందని చెప్పగా పరశురాం విజయ్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. నోటా కూడా బన్ని నుండి విజయ్ దగ్గరకు వెళ్లింది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో విజయ్ తమిళంలో కూడా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అది హిట్ అయితే కనుక బన్ని మంచి ఛాన్స్ మిస్సయినట్టే.