దుమ్ములేపుతున్న దేవదాస్ కలెక్షన్స్

SMTV Desk 2018-09-28 17:39:19  Devadas Collections, Nagarjuna, Nani,

కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ దేవదాస్. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో అశ్వనిదత్ నిర్మించారు. సెప్టెంబర్ 27 గురువారం రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అందుకే సినిమాకు వీక్ డే లో కూడా కలక్షన్స్ బాగా వచ్చాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం దేవదాస్ మొదటి రోజు 12 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని అంటున్నారు. 6.75 కోట్ల షేర్ కలక్షన్స్ తో దేవదాస్ మొదటి రోజు హంగామా సృష్టించింది. నాగ్, నానిల కాంబినేషన్ సినిమాగా వసూళ్లు న్యాయం చేసిందని చెప్పొచ్చు. మొదటి రోజు కలక్షన్స్ లో నాగార్జున కెరియర్ బెస్ట్ కాగా.. నానికి ఇది సెకండ్ హయ్యెస్ట్ ఫస్ట్ డే కలక్షన్స్ గా నిలిచింది దేవదాస్. రష్మిక, ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించారు. 38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన ఈ దేవదాస్ సినిమా చూస్తుంటే వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగ్, నాని దేవదాస్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల మెప్పు పొందింది.