అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

SMTV Desk 2018-09-28 16:46:40  Aravinda Sametha, Jr NTR, Trivikram,

ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అరవింద సమేత సినిమా ఆడియో ఆన్ లైన్ లో డైరెక్ట్ గా రిలీజ్ చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 2న హెచ్.ఐ.సి.సి లో జరుగనుందని తెలుస్తుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్.టి.ఆర్ కు సపోర్ట్ గా ఉండేందుకు నందమూరి బాలకృష్ణ వస్తాడని వార్తలొచ్చాయి. అయితే అతిథిలు ఎవరు లేకుండానే కేవలం చిత్రయూనిట్ సమక్షంలోనే అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపనున్నారట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ మూవీలో పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో సాంగ్స్ ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. ఇక తండ్రి మరణించినా సినిమా కోసం బాధ దిగమింగుకుని షూటింగ్ పూర్తి చేసిన తారక్ అభిమానుల ముందు ఏం మాట్లాడుతాడు.. ఎలా మాట్లాడుతాడు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. మొత్తానికి అతిథులు లేకుండానే అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తుంది.