చిరంజీవి బయోపిక్ : నటుడు బెనర్జీ

SMTV Desk 2017-07-19 14:22:44  Chiranjeevi, Biopic, actor, Banerjee

హైదరాబాద్, జూలై 19 : ఒక మాములు వ్యక్తిగా సినిమా పరిశ్రమకు వచ్చిన చిరంజీవి మంచి సినిమాలు చేస్తూ సుప్రీమ్ హీరో నుంచి మెగాస్టార్ గా ఎదిగారు. సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. అలాంటి ఆయన జీవితం బయోపిక్ చేస్తే అద్బుతమైన చిత్రం అవుతుందని నటుడు బెనర్జీ అన్నారు. 'మెగాస్టార్ చిరంజీవి గారి బయోపిక్ చేస్తే అదో అద్బుత చిత్రం అవుతుందని ఒక సాధారణ వ్యక్తి నుంచి మెగాస్టార్ గా ఎదిగిన ఆయన ప్రస్థానం అత్యద్భుతమని, సినిమాగా తీస్తే చాలా బాగుంటుందని అన్నారు. చిరంజీవి గురించి బయట ప్రపంచానికి తెలియని విషయాలు చాలా ఉన్నాయని తెలిపారు. ఆయనే ఒక రైటర్ ను పెట్టుకొని కథ రాసి సినిమా తీస్తే అద్భుతంగా ఉంటుంది. చిరంజీవి గారు సినిమాల్లోకి రాక ముందు నుంచి నాకు తెలుసని ఆయన అన్నారు. ఆయన సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇస్తే ఖచ్ఛితంగా చేస్తానని తెలిపారు. చిరంజీవిని అభిమానించే దర్శకులు పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. చిరంజీవిలో ఏదైనా సాధించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. కష్టపడే మనస్తత్వం ఆయనదని అందుకే ఒక సామాన్యుడి స్థాయి నుంచి మెగాస్టార్ గా ఎదిగారన్నారు. ఆయన చేసిన 150 వ సినిమా కూడా మొదటి సినిమా అనే భావన తోనే చేసారని బెనర్జీ అన్నారు.'